ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని దావగూడూరు గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయ భూములకు సోమవారం వేలం పాట నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్లాటలు చోటు చేసుకున్నాయి. ఆలయానికి మండలంలోని పలు గ్రామాల్లో భూములున్నాయి. 247.66 ఎకరాలకు వేలం నిర్వహించగా... 1-1లోని 5.05 ఎకరాల భూమిని గతంలో దావడూగురుకు చెందిన ముప్పా శ్రీను రూ.45 వేలకు దక్కించుకున్నారు. సోమవారం నాటి పాటలో అదే గ్రామానికి చెందిన నార్ని పద్మావతి రూ.65,500కు పాడుకున్నారు.
దీంతో గతంలో పాడుకున్న వారు, వారి కుటుంబీకులు ఆగ్రహంతో దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి ప్రయత్నించారు. కుర్చీలు విసిరారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను వారించారు. విషయం తెలుసుకున్న సీఐ లక్ష్మణ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో 144 సెక్షన్ అమలు చేశారు.
ఇదీ చూడండి: వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ సేవలు పునరుద్ధరణ