Conference In Ongole: ఒంగోలులోని కాపు కల్యాణ మండపంలో వామపక్షాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటు అంశాలపై వామపక్ష నేతలు చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఒక్క అంశాన్ని వైకాపా ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావించలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. కేంద్రాన్ని నిలిదీయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే అంతకంటే దారుణం మరొకటి లేదని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎవరూ కొనకపోతే మూసేస్తామని అంటున్నారని, ఇదేం విధానం అని రామకృష్ణ ప్రశ్నించారు. వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రామయ్యపట్నం పోర్టును తక్షణమే ప్రారంభించాలని, మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: RRR: పవన్ ఆ పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి: ఎంపీ రఘురామ