ETV Bharat / state

పర్చూరూలో ఈ నెల 10 వరకు సంపూర్ణ లాక్​డౌన్ - corona cases in parchur

ప్రకాశం జిల్లా పర్చూరులో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం ఒక్కరోజే అధికంగా కోవిడ్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం నుంచి ఈనెల 10 వ తేదీ వరకు సంపూర్ణ లాక్​డౌన్​ విధిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మంగళవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు పర్చూరూలో సంపూర్ణ లాక్​డౌన్

author img

By

Published : Aug 3, 2020, 8:01 PM IST

ప్రకాశం జిల్లా పర్చూరులో ఆదివారం ఒక్క రోజులోనే 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మండలంలో ఇప్పటివరకు 70 మంది వరకు కరోనా సోకగా ఒక్క పర్చూరులోనే 50 మందికిపైగా ఉన్నారు. మంగళవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు మండలంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించినట్లు తహసీల్దార్ కె. హరిబాబు, ఎస్ఐ రంగనాథ్ తెలిపారు. ఈ వారం రోజులు ఔషధ దుకాణాలు మినహా అన్ని దుకాణాలు మూసేస్తున్నట్లు వెల్లడించారు. పాలు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 నుండి 8 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు వీధులలో బ్లీచింగ్ చల్లారు. సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ వారం రోజుల లాక్ డౌన్​లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

మంగళవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు పర్చూరూలో సంపూర్ణ లాక్​డౌన్
మంగళవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు పర్చూరూలో సంపూర్ణ లాక్​డౌన్

ఇవీ చదవండి

కరోనా పాజిటివ్​ వ్యక్తి అత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.