ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయనున్న హెల్త్ సిటీకి జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. పేర్నమెట్ట వద్ద నాగార్జున విశ్వవిద్యాలయ స్థలాలకు సమీపంలో ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. ఈ హెల్త్ సిటీలో వైద్యానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు.. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రి నిర్మాణం ఉంటాయన్నారు. ఇందుకోసం అవసరమైన స్థలాలను సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనులు పంపనున్నారు. ఇందులో భాగంగా పేర్నమెట్ట కొండపై స్థలాన్ని పరిశీలించి, వివరాలను ఆర్డీఓ ను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: ఉమ్మడివరంలో పురాతన వెండి నాణేలు స్వాధీనం