ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో లోపాలను సవరించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ చెప్పారు. గురువారం రాత్రి ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, జిల్లా సంయుక్త కలెక్టర్ టీఎస్ చేతన్ లతో కలిసి పరిశీలించారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పేపరు రహిత సేవలను అందుబాటులోకి తెచ్చామని కలెక్టర్ తెలిపారు.
పూర్తిగా ఆన్ లైన్ సేవలు అమల్లోకి వచ్చాయన్నారు. వైద్యం, రోగుల పరిస్థితి, నిర్వహణ కోసం అన్ని వార్డుల్లో 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పరిశీలిస్తున్నామన్నారు. ఎవరైనా ఆన్ లైన్ ద్వారా తమ బంధువుల పరిస్థితి, వైద్యశాల నిర్వహణ వీక్షించే అవకాశం కల్పించామని చెప్పారు.
కోవిడ్ కేంద్రంలో ప్రస్తుతం 420 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఉండగా మరో 180 పడకలకు ఆ సౌకర్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కల్పిస్తామని కలెక్టర్ చెప్పారు. మరో 80 పడకలకు వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కరోనా బాధితులతో వచ్చిన బంధువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక షెల్టర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి:
అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థపై సీఎం జగన్ సమీక్ష