ETV Bharat / state

నీటి దొంగ కేసీఆర్‌కు.. జగన్ ఎలా సహకరిస్తారు? - cm on ycp

రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవాలని ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. మోదీ, కేసీఆర్‌కు వత్తాసు పలికే వ్యక్తి జగన్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

cm
author img

By

Published : Apr 4, 2019, 6:26 PM IST

ఏపీ నీటిదొంగ కేసీఆర్‌కు..జగన్ ఎలా సహకరిస్తారు: సీఎం
పసుపు-కుంకుమ చెక్కు రేపు డ్రా చేసుకోవచ్చని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పార్టీ ఎన్నికల ప్రచారానికి సీఎం హాజరయ్యారు.రైతు రుణమాఫీ నగదు ఈనెల 8లోగా ఖాతాల్లో పడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ పేదవాడూ ఇబ్బంది పడకూడదన్నారు. వెలుగొండ పూర్తి చేస్తానని... ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు. గోదావరి నీళ్లను సాగర్‌ కుడికాల్వకు మళ్లిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా 10 పైసలకే లీటర్‌ నీళ్లు ఇస్తామన్నారు. కరవు ప్రాంతం మార్కాపురాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ఐదేళ్లలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత తనదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని మోదీ, కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. మోదీ, కేసీఆర్‌కు వత్తాసు పలికే వ్యక్తి జగన్‌ అని అన్నారు. జగన్‌పై అనేక కేసులున్నాయి, అందుకే కేసీఆర్‌ అంటే భయమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులను కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి కేసీఆర్‌ ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఏపీ నీటిదొంగ కేసీఆర్‌కు...జగన్‌ ఎలా సహకరిస్తారని ప్రశ్నించారు. జగన్ జుట్టు మోదీ, కేసీఆర్‌ చేతుల్లో ఉందని ఎద్దేవా చేశారు.

Intro:ap_cdp_16_04_postal_bilot_employees_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
కడపలో మూడు కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ కు ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కడప జిల్లాలోని 10 నియోజకవర్గాలకు సంబంధించి మూడు కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలను నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా వచ్చి తమ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. ఎన్నికల విధులకు వెళ్లే ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ, పోలీస్ తదితర విభాగాలకు చెందిన వారందరూ తమ పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకున్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా రెవెన్యూ అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు.

Body:పోస్టల్ బ్యాలెట్

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.