ETV Bharat / state

CM jagan prakasam tour: నేడు వై.పాలెంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన

CM jagan y.palem Tour: ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పర్యటించనున్నారు. మంత్రి సురేశ్ కుమార్తె వివాహ విందుకు ఆయన హాజరుకానున్నారు.

యర్రగొండపాలెంలో సీఎం జగన్ పర్యటన
CM jagan prakasam tour
author img

By

Published : Dec 27, 2021, 8:53 AM IST

ముఖ్యమంత్రి జగన్‌.. నేడు యర్రగొండపాలెంలో పర్యటించునున్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కుమార్తె శ్రీష్టి, సిద్ధార్థల వివాహ రిసెప్షన్‌లో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను జగన్​ ఆశీర్వదించనున్నారు. ఈనెల 17న హైదారాబాద్‌లో మంత్రి సురేశ్ కుమార్తె వివాహం జరగ్గా.. నేడు యర్రగొండపాలెలంలో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

అధికారుల పర్యవేక్షణ..

CM jagan Minister Suresh daughter wedding party: వై.పాలెంలోని వినుకొండ రోడ్డులో మార్కెట్‌ యార్డు పక్కన హెలీప్యాడ్‌ను, 2 వేల మంది కూర్చునేలా రిసెప్షన్‌ వేదికను తీర్చిదిద్దారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి సురేష్‌తో కలిసి కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, ఎస్పీ మలికా గార్గ్‌, సీఎం ముఖ్య భద్రతాధికారి వకుల్‌ జిందాల్‌ ఆదివారం పర్యవేక్షించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. ముఖ్యమంత్రి తాడేపల్లిలోని నివాసం నుంచి సోమవారం ఉదయం 10.40 గంటలకు బయలుదేరి.. 11.25 గంటలకు వై.పాలెంలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. ఇందులో భాగంగా ఇప్పటికే హెలీకాప్టర్‌ ట్రయల్‌ రన్‌ను అధికారులు పూర్తిచేశారు. సీఎం కాన్వాయ్‌ ప్రయాణించే రహదారిలో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి..

CJI JUSTICE NV RAMANA : జడ్జిల నియామకంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.