ప్రకాశం జిల్లాలోని కందుకూరు, అద్దంకిలో ఉన్న పౌరసరఫరా గోదాముల్లో రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. ధాన్యం, కందులు, సజ్జలు వంటివి కొనుగోలు కోసం.. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గోనె సంచులను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. అయితే సరఫరా చేసిన గోనె సంచుల్లో అవకతవకలు జరిగాయని అధికారులకు ఫిర్యాదులు వెళ్లటంతో.. జిల్లా అధికారులు అప్రమత్తమై గోదాములు సీజ్ చేశారు. పౌర సరఫరాల గోదాములే కాకుండా, మార్కెఫెడ్ , వ్యవసాయ శాఖలకు చెందిన గోదాములనూ సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిపై సమగ్ర విచారణ నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
భూకబ్జాపై దివ్యాంగురాలి వీడియో వైరల్... మంత్రి నుంచి ఫోన్...