చీరాలలో తెదేపా కార్యకర్తల సంబరాలు ప్రకాశంజిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. వైకాపాలో చేరటంపై అక్కడి తెదేపా నేతలు సంబరాలు చేసుకున్నారు. పదవిలో ఉన్నంతకాలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆమంచి లబ్ధి పొందారని నేతలు ఆరోపించారు. ఆయన పార్టీని వీడటం వల్ల నష్టమేమీ లేదని చెప్పారు. నిజమైన కార్యకర్తలు తెదేపాతోనే ఉన్నారన్నారు.