ప్రకాశం జిల్లా చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాల కిడ్నీ బాధితులకు నాణ్యమైన సేవలు అందిస్తోంది. ఇక్కడికు చీరాలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కిడ్నీ వ్యాధిగ్రస్తులు వస్తున్నారు. 2016 అక్టోబర్ 31న అప్పటి ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాసరావు చేతుల మీదుగా ఇక్కడ వైద్యసేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు డయాలసిస్ కేంద్రం పనిచేస్తుంది. ఒక వైద్యుడితో పాటు 12 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం 111 మంది ఇక్కడ వైద్యసేవలు పొందుతున్నారు. డాక్టర్ హేమంత్ కుమార్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తారు. 2 వారాలకోసారి సంబంధిత వైద్య నిపుణులు వచ్చి పరిస్థితిని సమీక్షిస్తుంటారు. గత ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 2,500 రూపాయల పింఛను ఇవ్వగా.. ప్రస్తుత ప్రభుత్వం ఆ మొత్తాన్ని 10వేలకు పెంచింది. బాధితులు ఆధార్ బ్యాంకు ఖాతాల వివరాలు ఇస్తే... ఈ కేంద్రం ప్రతినిధులే ఆన్లైన్లో వాటిని పొందుపరుస్తారు. అనంతరం బాధితుల ఖాతాలో ప్రతినెల పింఛన్ జమ అవుతుంది.
ఇవీ చదవండి..