స్వచ్ఛ సర్వేక్షణ్ 2019-2020 సంవత్సరానికి ప్రకటించిన అవార్డుల్లో ప్రకాశం జిల్లా చీరాల రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఏడాదిపాటు చీరాల పట్టణంలో చేపట్టిన పరిశుభ్రతా కార్యక్రమాలు, తడి, పొడి చెత్త నిర్వహణ, పచ్చదనం, ప్లాస్టిక్ నియంత్రణ, చెత్త నుంచి సంపద తయారీ వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ దిల్లీలో ఈ అవార్డును ప్రకటించింది. దక్షిణ భారతదేశంలో 50 వేల నుంచి లక్షలోపు జనాభా కలిగిన 189 పట్టణాలు పోటీపడగా అందులో చీరాల పురపాలక సంఘం రెండో స్థానంలో నిలిచిందని అధికారులు తెలిపారు. చీరాల మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా నిర్వహించిన వీక్షణ సమావేశంలో పాల్గొని ఈ అవార్డును అందుకున్నారు. ప్రజల సహకారంతోనే ఈ అవార్డు దక్కిందని మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం.. చిక్కుకున్న 9 మంది