Cell phone towers: విద్యుత్తు విరామం వల్ల సెల్‌ఫోన్ టవర్లనూ జనరేటర్లతో నడపాల్సి వస్తోంది. సాధారణంగా కరెంటు పోయినా టవర్లు పనిచేసేలా వాటికి బ్యాటరీలు ఉంటాయి. ఇవి 3 గంటల్లో ఛార్జింగ్ అయితే.. విద్యుత్తు లేనప్పుడు 2 గంటలు యంత్రాలను నడిపిస్తాయి. కానీ.. పవర్‌హాలీడే వల్ల పూర్తిగా రెండు రోజులు విద్యుత్తు ఉండటం లేదు. దీంతో బ్యాటరీలు ఛార్జింగ్ కోల్పోతున్నాయి. ప్రకాశం జిల్లాలో గురు, శుక్రవారాలు విద్యుత్తు విరామం ప్రకటించడంతో ఆ రోజుల్లో వాటిని రీఛార్జి చేసేందుకు జనరేటర్లు తప్పనిసరైంది. ఈ 2 రోజులు ఒక టవర్ బ్యాటరీలు రీఛార్జి చేసేందుకు 100 లీటర్ల డీజిల్ ఖర్చవుతోందని నిర్వాహకులు తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం తలమళ్ల గ్రామంలో వ్యాన్‌లో జనరేటర్ తెచ్చి ఛార్జింగ్ పెట్టారు.
పవర్ హాలిడే కష్టాలు.. సెల్‌ఫోన్ టవర్లకు జనరేటర్లతో ఛార్జింగ్ - ప్రకాశం జిల్లాలో విద్యుత్ కోతల వల్ల సెల్‌ఫోన్ టవర్లకు జనరేటర్లతో ఛార్జింగ్
Cell phone towers: పవర్ హాలిడే వల్ల విద్యుత్ కష్టాలు తీవ్రమవుతున్నాయి. విద్యుత్ విరామంతో చివరకు సెల్‌ఫోన్ టవర్లను సైతం జనరేటర్లతో నడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం తలమళ్ల గ్రామంలో వ్యాన్‌లో జనరేటర్ తెచ్చి ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చింది.
Cell phone towers: విద్యుత్తు విరామం వల్ల సెల్‌ఫోన్ టవర్లనూ జనరేటర్లతో నడపాల్సి వస్తోంది. సాధారణంగా కరెంటు పోయినా టవర్లు పనిచేసేలా వాటికి బ్యాటరీలు ఉంటాయి. ఇవి 3 గంటల్లో ఛార్జింగ్ అయితే.. విద్యుత్తు లేనప్పుడు 2 గంటలు యంత్రాలను నడిపిస్తాయి. కానీ.. పవర్‌హాలీడే వల్ల పూర్తిగా రెండు రోజులు విద్యుత్తు ఉండటం లేదు. దీంతో బ్యాటరీలు ఛార్జింగ్ కోల్పోతున్నాయి. ప్రకాశం జిల్లాలో గురు, శుక్రవారాలు విద్యుత్తు విరామం ప్రకటించడంతో ఆ రోజుల్లో వాటిని రీఛార్జి చేసేందుకు జనరేటర్లు తప్పనిసరైంది. ఈ 2 రోజులు ఒక టవర్ బ్యాటరీలు రీఛార్జి చేసేందుకు 100 లీటర్ల డీజిల్ ఖర్చవుతోందని నిర్వాహకులు తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం తలమళ్ల గ్రామంలో వ్యాన్‌లో జనరేటర్ తెచ్చి ఛార్జింగ్ పెట్టారు.
TAGGED:
generator paper