కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లులో గుప్తనిధుల కోసం ఆంజనేయస్వామి, అమ్మవారి విగ్రహాలను దుండగులు పెకిలించడంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట్లోనే ఈ అరాచక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తే ఇలాంటి విధ్వంసకాండకు అడ్డుకట్ట పడేదని వ్యాఖ్యానించారు. ఇటువంటి దురాగతాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. దేవాలయాలు, దేవతా విగ్రహాలకు ప్రత్యేక భద్రత కల్పించాలని కోరారు.

ఇవీ చదవండి..