ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో సందీప్, చంద్రశేఖర్ అనే యువకులను హంసించటం తగదంటూ లేఖలో పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా వారిని అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వారిని అరెస్టు చేసిన సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
'మంత్రికి సంబంధించిన నగదు వ్యవహారంపై తమిళనాడులో ప్రచారం వచ్చింది. ఈ విషయంపై ఏపీలో ఎందుకు తనిఖీలు చేయలేదని సందీప్, చంద్రశేఖర్ ప్రశ్నించారు. అరెస్టు చేయడం ద్వారా వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించారు. జులై 16 మధ్యాహ్నం వారిని అరెస్టు చేశారు. 17వ తేదీ సాయంత్రం వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. అమానవీయ, అనాగరిక చర్యలను ఖండించాలి' అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి