చీరాల పట్టణ శివారులోని రామనగర్, న్యూ కాలనీలో పోలీసుల నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా అనుమతి పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 11 మంది అనుమానితులు, 5 లీటర్ల సారా, 400 లీటర్ల బెల్లం ఊట స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను చీరాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిర్బంధ తనిఖీల్లో చీరాల ట్రైనీ డీఎస్పీ శ్రవంతీ రాయ్, చీరాల సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: