ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి కనిగిరి వెళ్తుండగా... కనిగిరి టొబాకో బోర్డు సమీపంలో కారులో మంటలు చెలరేగాయి. కారులోని బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కావడంతో.. ఒక్కసారిగా కారులో నుంచి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. కారులో ఉన్న వ్యక్తులంతా అప్రమత్తమై, కారు నుంచి దూరంగా వెళ్లటంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది సురక్షితంగా బయటపడ్డారు.
ఇదీ చదవండి: