ప్రకాశం జిల్లా జెపంగులూరు మండలం బైటమంజులూరు సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. గుంటూరు డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు సోమవారం ఉదయం... ఒంగోలు నుంచి విజయవాడకు బయలుదేరింది. పంగులూరు మండలం బైటమంజులూరు వద్ద స్టీరింగ్ పట్టేయడంతో... అదుపుతప్పి రహదారి అంచుల్లోకి దూసుకెళ్లింది. అక్కడ ఫెన్సింగ్ ఉండడంతో ఆ స్తంభాలను ఢీకొట్టి ఆగిపోయింది.
ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులకు స్పల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షత గాత్రులను 108 సిబ్బంది మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు రేణింగవరం ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చదవండి: