ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు వద్ద పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10మందికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ పాఠశాల ఉపాధ్యాయులు... తమ కుటుంబసభ్యులతో ప్రకాశం జిల్లా భైరవకోనకు విహారయాత్రకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి బస్సును అదుపు చేయలేక ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బోల్తాపడ్డ అనంతరం 40 మీటర్లు వరకూ బస్సు ఈడ్చుకుంటూ వెళ్లటంతో ఒకవైపున కూర్చున్న 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
ఇవీ చదవండి: కరోనా కాటుకు మరో 86 మంది బలి