BJP MP GVL: దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా ఆంధ్రప్రదేశ్‌కే కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించిందని భాజపా ఎంపీ నరసింహారావు అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో వైకాపా.. పథకాలకు తమపేర్లు పెట్టుకుని సొంత డబ్బా కొట్టుకుంటోందని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో 20 నెలలపాటు ఉచిత బియ్యాన్ని ప్రజలకు కేంద్రం పంపిణీ చేసిందని.. మామూలులు సమయంలో ఇచ్చే బియ్యంలో కూడా సబ్సిడీ అంతా కేంద్రమే భరిస్తోందని చెప్పారు.
గత అరేళ్లలో రూ.24 వేల కోట్లను ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే కేంద్రప్రభుత్వం కేటాయించినా.. ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదనటం హస్యాస్పదమన్నారు. ఈ విషయంపై వైకాపాతో చర్చకు భాజపా సిద్ధమని సవాల్ విసిరారు. అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకే శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసామని తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాలలో భాజపా శక్తి కేంద్ర ప్రముఖ్‌ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భాజపా శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: Nakka Anandbabu: న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు సీఎం యత్నం: నక్కా ఆనంద్ బాబు