రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలకు ఎలాటి రక్షణ కల్పిస్తుందో స్పష్టం చేయాలని భాజపా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనపై చలో అమలాపురం కార్యక్రమం తలపెట్టిన భాజపా నాయకులను పోలీసులు ఎక్కడికిక్కడే గృహ నిర్భంధం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా కారంచేడులోని స్వగృహంలో మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని ముందస్తుగా పోలీసులు గృహ నిర్భంధం చేశారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా భాజపా ఆందోళన చేయడానికి నిర్ణయం తీసుకుందన్నారు. తమ నాయకులను గృహ నిర్భంధం చేయటం దారుణమన్నారు. ఆలయాల భూములను సైతం రాష్ట్రప్రభుత్వం అమ్ముతుందని పురంధేశ్వరి ఆరోపించారు.
ఇదీ చదవండి: కేంద్ర హోంశాఖ మంత్రికి భాజపా ఎంపీల లేఖ