తాను వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్ వెళితే... వైరస్ ప్రభావానికి గురైనట్లు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఒంగోలులో లాక్డౌన్ అమలవుతున్న తీరును మంత్రి బాలినేని పరిశీలించారు. బాపూజీ కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన సోడియం హైపో క్లోరైడ్ ద్రావణ ద్వారాన్ని మంత్రి ప్రారంభించారు. నిత్యావసరాల సరఫరా కార్యక్రమం అమలును పరిశీలించారు.
ఇదీ చదవండి: ఎక్స్ప్రెస్ పార్శిల్ రైళ్ల సేవలను ముమ్మరం చేసిన రైల్వేశాఖ