ETV Bharat / state

శ్మశానం.. చెెరువే హద్దులుగా నివేశన స్థలాలు - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

ప్రకాశం జిల్లాలో ఇళ్ల స్థలాల సేకరణ వ్యవహారంలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. కొరిశపాడు మండలం పమిడిపాడులో శ్మశానం, చెరువు మధ్యన ఉన్న స్థలాన్ని పేదలకు ఇళ్లు కోసం అధికారులు సేకరించాలని నిర్ణయించారు. దీనిపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.

house sites
house sites
author img

By

Published : Dec 10, 2020, 5:54 PM IST

పేదలకు ప్రభుత్వం ఇస్తానన్న నివేశన స్థలాల గడువు ఒక వైపు... దానికి అనుగుణంగా లేఅవుట్లు సిద్ధం చేయడం మరో వైపు... దీనివల్ల ఆగమేఘాల మీద దస్త్రాలు కదిలిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో గతంలో సేకరించిన స్థలాలపై విమర్శలు, అభ్యంతరాలున్నా వాటినే ఖరారు చేస్తున్నారు. స్థానికంగా రాజకీయ జోక్యం కూడా ఉంటుండటంతో 'ఎక్కడని అడక్కు.. ఎక్కడిచ్చినా పుచ్చుకో' అనే విధంగా స్థలాల సేకరణ జరుగుతోందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితే కొరిశపాడు మండలం పమిడిపాడులో నెలకొంది.

కొరిశపాడు మండలం పమిడిపాడులో 170 మందికి నివేశన స్థలాలు ఇవ్వడానికి శివారులో మూడెకరాల భూమిని రెవెన్యూ అధికారులు సేకరించేందుకు సిద్ధపడి గ్రామసభ నిర్వహించారు. ఆ ప్రదేశం శ్మశానానికి ఆనుకుని ఉంటుందని, దాని వెనుక ఊర చెరువు ఉందని కొందరు అభ్యంతరం తెలిపారు. దీనివల్ల గ్రామసభ వాయిదా పడగా లబ్ధిదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత అధికారులూ దాని వైపు చూడలేదు.

గడువు ముంచుకొస్తుండగా..

ఇళ్ల పట్టాల పంపిణీ ఈ నెల 25న నిర్వహించనుండగా తాజాగా గ్రామ సభ ఏర్పాటు చేసి లాటరీ తీశారు. ఆ మేరకు గతంలో వివాదం ఉన్న స్థలాన్ని ఖరారు చేశారు. పొలం పనులకు వెళ్లిన సమయంలో లాటరీ ఎలా తీస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సేకరించిన పొలం రోడ్డుకు కొంచెం దిగువన ఉందని, మట్టితో లెవల్‌ చేయడానికి చాలా వ్యయమవుతుందని చెబుతున్నారు. ఈ విషయమై గతంలో ఉన్నతాధికారులకు అర్జీలు ఇచ్చినా ఎటువంటి ప్రయోజన లేకుండా పోయిందంటున్నారు. కొందరు స్థానిక అధికారుల అత్యుత్సాహంతో గ్రామ సమీపంలో మంచి పొలం అందుబాటులో ఉన్నా చెరువు, శ్మశానం మధ్యన ఉన్న స్థలాన్నే ఖరారు చేశారని వాపోతున్నారు. శ్మశానాల పక్కన, చౌడు భూముల్లో ఇళ్లు ఎలా నిర్మించుకోవాలని, ఇప్పటికైనా అందరికీ ఆమోదయోగ్యమైన స్థలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని వేడుకుంటున్నారు.

అభ్యంతరాలేమీ రాలేదు

గ్రామస్థులకు ఇళ్లపట్టాలు ఇవ్వడానికి స్థల సేకరణ చేశాం. దానిపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా తెలియజేయాలని కోరాం. సంబంధిత ప్రకటనలను పంచాయతీలో అంటించాం. గ్రామస్థుల నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. ఆ భూమినే నివేశన స్థలాలకు కేటాయించాల్సి వచ్చింది. - లక్ష్మీనారాయణ, తహసీల్దార్‌, కొరిశపాడు

ఇదీ చదవండి

రూ.2 లక్షలకు మహిళను దుబాయ్ షేక్​కు అమ్మేశారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.