అద్దంకి భవానీ కూడలి సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే వ్యక్తి పై.. కొందరు వ్యక్తులు దాడి చేశారు. బాధితుడికి తీవ్రగాయాలవ్వగా.. ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల క్రితం క్యూ లైన్లో నిలబడమని చెప్పినందుకు ఉద్దేశ్య పూర్వకంగా దాడికి పాల్పడ్డారని బాధితుడు తెలిపాడు. సంఘటనపై పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ.. నూజివీడులో ఘోర ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన లారీ.. ఆరుగురు మృతి