ETV Bharat / state

కరణం బలరాం తప్పుడు వివరాలు ఇచ్చారు: ఆమంచి - AmanchI Krishna Mohan Fires On Karanam Balaram

ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కరణం బలరాం... ఎన్నికల అఫిడవిట్​లో తప్పుడు వివరాలు పొందుపర్చారని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు.

ఆమంచి కృష్ణమోహన్
author img

By

Published : Jul 10, 2019, 7:03 AM IST

ఆమంచి కృష్ణమోహన్

చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన కరణం బలరాం ఎన్నికల అఫిడవిట్​లో తప్పుడు వివరాలు పొందుపర్చారని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. ఆయనకు నలుగురు సంతానం అయితే... అఫిడవిట్​లో ముగ్గురు సంతానం అని తప్పుగా పేర్కొన్నట్లు తెలిపారు. విజయవాడ వైకాపా రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. కరణం బలరాంకు నలుగురు సంతానమని... కరణం అంబిక కృష్ణ ఆయన కూతురేనని చెప్పారు. అంబిక కృష్ణ జనన ధ్రువీకరణ పత్రం, ఇతర సర్టిఫికెట్​లు, ఆధార్ కార్డు అందుకు ఆధారమని పేర్కొన్నారు. తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసినందుకు బలరాంను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

ఇదీ చదవండీ...

సంక్షేమానికే ప్రాధాన్యం.. నిధుల కొరత రానివ్వకండి: సీఎం

Intro:రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రవాణా కు బ్రేక్ వేయడంతో అక్రమార్కులు బరితెగించారు. తిరుపతి అర్బన్ మండలం తహసిల్దార్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు. నకిలీ అనుమతి పత్రం తయారు చేసుకుని.. వాటి ద్వారా ఇసుక అక్రమ రవాణా కు తెరతీశారు. చివరికి రెవెన్యూ అధికారుల కంట్లోనే పడి చిక్కినట్టే చిక్కి పరారయ్యారు.

Body:రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక విధానం అమలు చేయడానికి ఇసుక తవ్వకాలు నిలిపివేయడంతో చిత్తూరు జిల్లాలో ఇసుక కొరత ఏర్పడింది. దీంతో ఎక్కడ భవన నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. ఇదే అదునుగా ఇసుకాసురులు.. ఎలాగైనా ఇసుకను తరలించి సొమ్ములు చేసుకోవాలనే దురాలోచనతో ఏకంగా తిరుపతి అర్బన్ మండలం తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పట్టణ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం పేరుతో అనుమతి పత్రం తయారు చేశారు. ఆ పత్రంతో టాక్టర్ ట్రక్ ఇసుకతో నగరంలోకి ప్రవేశించారు. అనుమానం వచ్చి విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ ట్రాక్టర్ ను ఆపి అనుమతి పత్రాన్ని పరిశీలించారు. పత్రం లో తహసీల్దార్ సంతకం ఉన్నప్పటికీ సీల్ లేకపోవడంతో అనుమానం వచ్చి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సీల్ వెయించుకోని రావాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. సీల్ వేయించుకోవడం కోసం ఒక వ్యక్తి తహసీల్దార్ కార్యాలయం కి వచ్చి అనుమతి పత్రాన్ని సంబంధిత అధికారులకు ఇవ్వగా నకిలీ అని తేలింది. పత్రంలో తహసీల్దార్ సంతకం కాదని అధికారులు తేల్చి చెప్పడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.