ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పరిధిలో సజ్జ పంటలను రైతులు అధికంగా సాగు చేశారు. ఎకరానికి 10 నుంచి 12 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేశారు. ఎకరానికి సుమారు 12 క్వింటాల మేర దిగుబడి వచ్చింది. ఫలితంగా రైతన్నల కళ్లలో ఆనందం వెళ్లి విరిసింది.
తాత్కాలికమే అయ్యింది..
రైతుల ఆనందం తాత్కాలికమే అయ్యింది. ప్రభుత్వం సజ్జలకు గిట్టు బాటు ధర కల్పించినా.. పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల పంటను అమ్ముకునే సదుపాయం కొరవడింది. ఫలితంగా దళారులు రంగప్రవేశం చేసి వ్యవసాయదారులకు మాయ మాటలు, మోసపూరిత వాగ్థానాలు చేశారు. దళారులు నిర్ణయించిన ధరకే పంట విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి సజ్జ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు.