ఇదీ చదవండి
తెదేపా ప్రభుత్వం ద్వారానే మహిళలకు గౌరవం: అజితరావు - ajitha rao
తెదేపా ప్రభుత్వం ద్వారానే మహిళలకు సముచిత స్థానం దక్కుతుందని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అభ్యర్థి బుదాల అజిత రావు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ డా. మన్నె రవీంద్రతో కలసి ఆమె విస్తృత ప్రచారం చేపట్టారు.
బుదాల అజితరావు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం తెదేపా అభ్యర్థి బుదాల అజితరావు ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకోపోవాలంటే చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు అనుకున్నది ఏదైనా సాధిస్తారని... అందుకోసం మహిళలందరూ ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా శిద్దా రాఘవరావును అఖండ మెజారిటీతో గెలించాలని ప్రజలను అజితరావు కోరారు.
ఇదీ చదవండి
sample description