వరుసగా పెరుగుతున్న పెట్రోలు ధరలు వాహన దారులపై మూలిగే నక్క మీద తాటికాయి పడ్డ చందంగా మారాయని ఏఐఎంఐఎం పార్టీ నాయకులు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్టూరులో పార్టీ ఆధ్వర్యంలో పెట్రో ధరలు పెంపును నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. కరోనా నిబంధనలు, బౌతికదూరం పాటిస్తూ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి.. రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతుంటే.. కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేకపోవటం శోచనీయమని ఎంఐఎం మార్టూరు పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి...