ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో నగర పంచాయతీ వారి ఆధ్వర్యంలో రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అద్దంకి వైసీపీ ఇంచార్జి బాచిన కృష్ణచైతన్య, పట్టణ మున్సిపల్ కమీషనర్ ఫజులుల్లా హాజరయ్యారు. ఒక మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాయకులు జ్యోతి హనుమంతరావు, కోట శ్రీనివాసు, గూడా శ్రీనివాసరెడ్డి, వార్డు ఇంచార్జ్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇది చదవండి చీరాలలో ఒక్కరోజే 17 కరోనా పాజిటివ్ కేసులు