ETV Bharat / state

ఒంగోలులో డాబాను తోటగా మార్చిన గృహిణి - ongole women farming vegetables in terrace

మెుక్కలపై మమకారం తన ఇంటి టెర్రస్‌ను తోటగా మార్చింది ఓ గృహిణి. పూలు, పండ్లును పూర్తి శాస్త్రీయ పద్ధతిలో పండిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వాటిని తమ బంధువులతో పంచుకుంటూ.. వారిని కూడా సహజ సాగు వైపు ప్రోత్సహిస్తున్నారు.

farming vegetables in  Terrace
ఒంగోలులో డాబాను తోటగా మార్చిన గృహిణి
author img

By

Published : Jan 8, 2021, 3:39 PM IST

ఒంగోలుకు చెందిన రాజేంద్ర, సునీత దంపతులు నిర్మల్‌ నగర్‌లోని అపార్టు మెంట్​లో నివాసముంటున్నారు . మెుక్కల పై ఎంతో ఇష్టం ఉన్న సునీత... తన ఇంటి ఇంటి టెర్రస్‌నే తోటగా మార్చేసింది. కూరగాయలు, ఆకు కూరలు, పూల మొక్కలు, క్రోటర్స్, బోన్సాయ్‌ మొక్కలు వంటివి పెంచుతూ తన అభిరుచిని ప్రదర్శిస్తున్నారు. ఈ కూరగాయలు ఇంటి అవసరాలకు సరిపోగా, తమ బంధువులకు కూడా ఉచితంగా అందిస్తున్నారు. లాక్‌ డౌన్‌ సమయం నుంచి పూర్తిగా ఇంటి వద్ద సాగు చేసిన కూరగాయలే వినియోగిస్తున్నట్లు ఆమె తెలిపారు.

సహజ సాగు...

తొలుత కేవలం మట్టి తీసుకొచ్చి కుండీల్లో వేసి పెంచేవారు. ప్రస్తుతం కొబ్బరి పీచు, ఇంటిలోని వ్యర్థ పదార్థలతో కంపోస్టు తయారు చేసుకొని మట్టిగా వాడుకుంటున్నారు. పూర్తిగా ప్రకృతి సాగు పద్దతిలోనే వీటిని పండిస్తున్నారు. కుండీలుగా చౌకగా వచ్చే ప్లాస్టిక్‌ డబ్బాలు, వ్యర్థాలుగా పారేసే కూల్‌డ్రింక్‌, వాటర్‌ బాటిల్స్‌, మట్టి కుండలు వంటివి వినియోగిస్తున్నారు. వీటికి రంగులు అద్ది అందంగా అలంకరించి వినియోగించడం వల్ల మరింత ఆహ్లాదాన్ని సంతరించుకుంటున్నాయి. కుండీలు నిలబట్టేందుకు సొంతంగా స్టాండ్‌లను తయారు చేయించుకున్నారు. వీటన్నింటిని సమకూర్చుకోవటంలో తనభర్త రాజేంద్ర పూర్తి సహకారం అందిస్తున్నారని సునీత తెలిపారు. ఆసక్తి ఉండాలే గానీ, స్థలం తక్కువున్నా చక్కని వ్యవసాయం చేసుకోవచ్చునని, ఇంటి అవసరాలకోసం మిద్దె తోటలు ఎంతో ఉపకరిస్తాయని ఆమె పేర్కొంటున్నారు.

ఇదీ చదవండీ...యానంలో ముగిసిన ప్రజాఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.