ETV Bharat / state

police : ప్రేమ అన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత నిజస్వరూపం బయటపెట్టాడు! - prakasam district latest news

ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలకాలం కలిసి బతకాలని కబుర్లు చెప్పుకున్నారు. ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకోవటానికి మూడేళ్లపాటు సహజీవనం సైతం చేశారు. చివరికి పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ.. ఆ తర్వాత కట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేయసాగాడు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఆ భర్త ఓ పోలీసు అధికారి. వరకట్నం చట్ట వ్యతిరేకమని చెప్పాల్సిన పోలీసే.. భార్యను వేధించాడు!

మహిళ
మహిళ
author img

By

Published : May 5, 2022, 6:19 PM IST

Updated : May 5, 2022, 6:39 PM IST

అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్న తన భర్త నుంచి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్​ను ఆశ్రయించింది. ఒంగోలు పీటీసీలో ఎస్‌ఐగా పనిచేస్తున్న వినోద్ కుమార్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని అతని భార్య ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకొని నడిరోడ్డుపై వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రేమ అన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత నిజస్వరూపం బయటపెట్టాడు!

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రోజారాణికి ఎస్ఐ వినోద్ కుమార్​కు పెదకాకానిలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు మూడు సంవత్సరాలపాటు సహజీవనం చేశారు. అనంతరం ఏడు నెలల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొద్దినెలలలోనే తనను అదనపు కట్నం కోసం వేధించసాగడని ఆవేదన వ్యక్తం చేసింది.

అంతే కాకుండా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపించింది. ఎస్​ఐ వినోద్ కుమార్​పై మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తక్షణం పోలీసు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంది. ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు.. ఎస్ఐ వినోద్ కుమార్​ను సస్పెండ్ చేశారు.

ఇదీ చదవండి: VIRAL VIDEO పేకాట ఆడుతున్న చిన్నారులను వాళ్లు ఏం చేశారో తెలిస్తే షాక్?

Last Updated : May 5, 2022, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.