ప్రకాశంజిల్లాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పర్యటించారు. మద్దిపాడు మండలంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. జిల్లాలో సంక్షేమ పథకాల అమలు, వాటి తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాల గురించి ఆరా తీశారు. గుండ్లకమ్మ జలాశయం ద్వారా రైతులకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తామన్నారు. జలాశయాన్ని చెప్పుకోదగ్గ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
ఇదీచదవండి