పింఛన్ అందటం లేదని ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ధర్నా చేపట్టింది. తర్లుపాడు మండలం తుమ్మలచేరువు గ్రామానికి జమినాబి అనే దివ్యాంగురాలు.. పింఛన్ కోసం... 10 ఏళ్లుగా కార్యలయాల చుట్టూ తిరుగుతున్నట్టు తెలిపింది.
అయినా.. అధికారులు కనికరించడం లేదని ఆవేదన చెందింది. విసుగు చెంది కుటుంబంతో సహా నిరసనకు దిగినట్టు తెలిపింది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబం వేడుకుంటోంది. భాజాపా నాయకుడు పీవీ కృష్ణారావు ఆ కుటుంబానికి మద్దతుగా బైఠాయించారు.
ఇదీ చదవండి: