ETV Bharat / state

చీరాల ఎస్సై విజయ్​కుమార్​పై అట్రాసిటీ కేసు - prakasam district latest news

ప్రకాశం జిల్లా చీరాలలో దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతి కేసులో నిందితుడైన పట్టణ టూటౌన్ ఎస్సై విజయ్​ కుమార్​పై అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. మృతుడి తండ్రి అభ్యర్థనపై స్పందించిన పోలీసులు... ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

chirala two town si Vijay Kumar
chirala two town si Vijay Kumar
author img

By

Published : Oct 1, 2020, 3:44 PM IST

ప్రకాశం జిల్లా చీరాల దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతి కేసులో నిందితుడైన చీరాల టూటౌన్ ఎస్సై విజయకుమార్​పై ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్లను కూడా జోడించింది పోలీసు శాఖ. ఈ మేరకు బుధవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఏడాది జులైలో చీరాలలోని థామస్‌పేటకు చెందిన కిరణ్‌కుమార్(26)‌ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఎస్సై విజయ్ కుమార్ కొట్టడం వల్లే అతను చనిపోయాడని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం స్పష్టించిన ఈ కేసులో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ కేసులో ఎస్సై విజయకుమార్​పై మొదట కేవలం ఐపీసీ 324 సెక్షన్ కింద మాత్రమే కేసు నమోదు చేశారు. అయితే మృతుడు ఎస్సీ కావటంతో ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్ల కింద కూడా కేసు పెట్టాలంటూ మృతుడి తండ్రి మోహన రావు పోలీసు ఉన్నతాధికారులను లిఖితపూర్వకంగా కోరారు. దీనిపై ఈ కేసు విచారణాధికారి డీఎస్పీ బాలసుందరరావు సమగ్రంగా దర్యాప్తు జరిపి ఎస్సై విజయ్ కుమార్​పై ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్లను కూడా పెట్టాలంటూ సిఫార్సు చేశారు. ఈ క్రమంలో చీరాల టూటౌన్ సీఐ రోశయ్య అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.