ETV Bharat / state

Warangal Road Accident Today : ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ముగ్గురు మృతి - car accident in warangal today

తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వర్దన్నపేట పట్టణ శివారు డీసీ తండా వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

Warangal Road Accident Today
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ముగ్గురు మృతి
author img

By

Published : Nov 8, 2022, 7:15 AM IST

Warangal Road Accident Today : తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వర్దన్నపేట పట్టణ శివారు డీసీ తండా వద్ద ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి పంపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని కృష్ణారెడ్డి, వరలక్ష్మి, వెంకటసాయి రెడ్డిగా గుర్తించారు. ఏపీలోని ఒంగోలు నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి పొగమంచే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.