నెల్లూరు జిల్లా కోట మండలంలో తోళ్ల పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని.. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి వైకాపా నేతలు విన్నవించారు. తోళ్ల శుద్ధి కర్మాగారాన్ని రద్దు చేయాలంటూ వైకాపా రాష్ట్ర కార్యదర్శి శ్యాంప్రసాద్ రెడ్డి, ఆ పార్టీ నేత ప్రభాకర్ గౌడ్‌లు మంత్రికి వినతిపత్రం అందజేశారు. తోళ్ల పరిశ్రమ తప్ప, ప్రజలకు ఉపయోగపడే ఇంకేదైన పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరారు. పరిశ్రమ రద్దుకు ప్రయత్నిస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా, తోళ్ల పరిశ్రమకు వ్యతిరేకంగా పదేళ్ళుగా పోరాటం చేస్తున్నామని.. అవసరమైతే సీఎం దృష్టికి తీసుకెళ్లి, ప్రజల పక్షాన ఉద్యమిస్తామని వైకాపా నేతలు అన్నారు.
ఇదీ చదవండి: ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో పోలీసులు తొందరపడవద్దు: హైకోర్టు