ETV Bharat / state

డంపింగ్‌ యార్డ్‌ను తలపిస్తోన్న బారా షహీద్‌ దర్గా - నిర్వహణను గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం - బారా షహీద్‌ దర్గా నిర్వహణను గాలికొదిలేసిన వైసీపీ

YSRCP Government Negligence on Bara Shaheed Dargah: ప్రపంచవ్యాప్తంగా నెల్లూరు జిల్లా బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు ప్రసిద్ధి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక దర్గా నిర్వహణను పూర్తిగా గాలికొదిలేయడంతో పర్యాటక ప్రాంతమైన బారా షహీద్‌ దర్గా.. డంపింగ్‌ యార్డ్‌ను తలపిస్తోంది.

YSRCP_Government_Negligence_on_Bara_Shaheed_Dargah

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2023, 7:25 AM IST

Updated : Nov 16, 2023, 8:26 AM IST

డంపింగ్‌ యార్డ్‌ను తలపిస్తోన్న బారా షహీద్‌ దర్గా - నిర్వహణను గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం

YSRCP Government Negligence on Bara Shaheed Dargah : ప్రపంచవ్యాప్తంగా రొట్టెల పండుగకు పేరుపొందిన నెల్లూరు జిల్లా బారా షహీద్‌ దర్గా.. నేడు అధికారుల నిర్లక్ష్యంతో సమస్యలకు నిలయంగా మారింది. స్వర్ణాల చెరువు (Swarnala Cheruvu) ఘాట్ల వద్ద రొట్టెలు మార్చుకుని మొక్కులు తీర్చుకునేందుకు ఏడాది పొడవునా భక్తులు ఇక్కడకు వస్తుంటారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party )హయాంలో కోట్లు వెచ్చించి ఈ దర్గాను సుందరంగా తీర్చిదిద్దారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక దర్గా నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసింది. గతంలో అందరి అభినందనలు పొందిన బారా షాహీద్ దర్గా.. వైఎస్సార్సీపీ పాలనలో నిర్హహణ లేక మురికి కూపంలా తయారైంది.

Roti Festival at Bara Shaheed Dargah : నెల్లూరు జిల్లా బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు ప్రసిద్ధి. నెల్లూరు పొదలకూరు రోడ్డులో సుమారు 100 ఎకరాల్లో బారాషాహీద్ దర్గా విస్తరించి ఉంది. ఇక్కడ స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద రొట్టెలు మార్చుకుని మొక్కు తీర్చుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ఏడాది పొడవునా భక్తులు వస్తుంటారు. తెలుగుదేశం పార్టీ హయాంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దర్గాను కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశారు.

ఆలనాపాలనకు నోచుకోని స్వర్ణాల చెరువు

నాడు వైభవంగా అలరారిన బారా షహీద్‌ దర్గా నేడు చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా మారింది. స్వర్ణాల చెరువు వద్ద స్నానాల ఘాట్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి. దర్గా పరిసర ప్రాంతాల్లో చనిపోయిన మూగజీవుల కళేభరాలు భక్తులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక దర్గా నిర్వహణను పూర్తిగా గాలికొదిలేయడంతో పర్యాటక ప్రాంతమైన బారా షహీద్‌ దర్గా.. డంపింగ్‌ యార్డ్‌ను తలపిస్తోంది.

Bara Shaheed Dargah Roti Festival in Nellore District : స్వర్ణాల చెరువు వద్ద వాహనాలు కడిగితే జరిమానా విధిస్తామంటూ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసిన అధికారులు.. దర్గా పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నా పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోరా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు స్నానాలు చేసేందుకు సదుపాయాలు లేవు. వంట చేసుకునేందుకు సౌకర్యాలు కల్పించలేదు. ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చే మహిళా పర్యాటకులకు రక్షణ లేకుండా పోయింది. వాహనాలు కడిగితే వెయ్యి రూపాయలు జరిమానా అంటూ కమిషనర్ పేరుతో బోర్డును ఏర్పాటు చేశారు.

Rottela Pandaga 2023: వైభవంగా నెల్లూరులో రొట్టెల పండగ.. పెరిగిన భక్తుల తాకిడి

Rottela Panduga in Nellore : అధికారుల నిర్లక్ష్యంతో స్వర్ణాల చెరువు ఘాట్ చెత్తకుప్పలా మారింది. అధికారుల నిర్లక్ష్యానికి జరిమానా లేదా అని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. మొక్కలు పెంచకపోగా, ఉన్న మొక్కలు ఎండిపోతున్నా ప్రజా ప్రతినిధులు, వక్ఫ్ బోర్డు సభ్యులు పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు. దర్గా పరిసర ప్రాంతాల్లో లైట్లు లేకపోవడంతో రక్షణ కరవైందని మహిళలు చెబుతున్నారు.

మొక్కలను సంరక్షించే వారు లేక ఎండిపోతున్నాయి. భద్రత సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో పార్కులు, దర్గా పరిసరాలు పశువులకు ఆవాసాలుగా మారాయి. దర్గా అభివృద్ధి, పరిశుభ్రత, వసతుల కల్పనపై ప్రజాప్రతినిధులు కానీ వక్ఫ్‌ బోర్డు సభ్యులు కానీ పట్టించుకున్న పరిస్థితి లేదని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

స్వర్ణాల చెరువు శోకానికి బాధ్యులెవరు!?

Last Updated : Nov 16, 2023, 8:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.