ETV Bharat / state

ఏడాది పాలనలో.. ఏదీ అభివృద్ధి?: ఆనం - అధికారులపై ఆనం రామనారాయణరెడ్డి విమర్శల వార్తలు

రాష్ట్ర ప్రభుత్వ పాలనపై అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాలనలో కేకులు, సంబరాలు తప్పితే తన నియోజవర్గంలో అభివృద్ధి శూన్యమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏడాదిలో పనులు జరగకపోతే ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తానని హెచ్చరించారు.

ycp-mla-aanam-rama-narayana-reddy-crtitcises-officers

author img

By

Published : Jun 3, 2020, 4:08 PM IST

Updated : Jun 3, 2020, 4:53 PM IST

అధికారులపై ఎమ్మెల్యే ఆనం ఆగ్రహం

ఏడాది పాలనలో అభివృద్ధి ఏది అంటూ... నెల్లూరు జిల్లా వెంకటగిరి వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులను తూర్పారాబట్టారు. ఏడాది పాలనలో కేకులు, సంబరాలు తప్పితే తన నియోజవర్గంలో అభివృద్ధి శూన్యమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా అధికారులపై విమర్శలు చేశారు.

ఈ ఏడాది చూస్తానని, పనులు జరగకపోతే ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తానని హెచ్చరించారు. జిల్లాలో వెంకటగిరి నియోజవర్గం కూడా ఒకటి ఉందని అధికారులు గుర్తించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు కూడా అమలు కావటంలేదని అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో జల దోపిడి లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

'నేనలా అనలేదు.. నా వ్యాఖ్యలు వక్రీకరించారు'

Last Updated : Jun 3, 2020, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.