నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల ఉత్తర కాలువలో ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతయ్యాడు. 14ఏళ్ల సుజిత్ ఈత కోసం వెళ్లగా.. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కాలువలో కొట్టుకుపోయాడు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు గాలింపు చర్యలు చేపట్టారు. కాలువకు కొద్ది దూరంలోనే బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.
ఇదీ చదవండి: