పెన్నా బ్యారేజీ పనులు వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేస్తామని బ్యారేజీ ఈ.ఈ విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సంవత్సరం నుంచి పనులు ఆగిపోగా... నూతనంగా వచ్చిన ప్రభుత్వం పనులను పరిశీలించి గుత్తేదారుకు రావాల్సిన పాత బకాయిలను చెల్లించిందన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులను తిరిగి మెుదలు పెడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 87శాతం పనులను పూర్తయ్యాయన్నారు. గేట్లు, కాంక్రీట్ పనులు పెండింగ్లో ఉన్నాయని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.
ఇదీచదవండి