కరోనా వైరస్ ప్రభావం.. నెల్లూరు జిల్లాలో సాగునీటి సలహా మండలి సమావేశంపై పడింది. సదస్సు లేకుండానే రెండో పంటకు సాగునీరు విడుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు. ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు. పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలోని లక్షా ఎనభై వేల ఎకరాలకు సాగు నీరు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయకట్టు పరిధిలోని పది కాల్వలకు నీరు త్వరలోనే విడుదల చేస్తామన్నారు. రైతులు ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి: