చుక్కనీటిని వృథా చేయొద్దని ప్రభుత్వం పిలుపునిస్తున్నా.. ఇలాంటి ప్రాంతాల్లో ఫలితం కానరావడం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంకుడు గుంతలు, నీరు - చెట్టు, చెక్‌డ్యాంల నిర్మాణం, పంట సంజీవని కుంటల నిర్మాణం చేపడుతుంటే... నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు మాత్రం ప్రభుత్వ ఆశయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. మంచినీటిని వృథాగా వదిలేస్తున్నారు. ఫలితంగా ఎండాకాలంలో ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు.
నెల్లూరు నగరంలోని సర్ధార్ వల్లభాయ్పటేల్నగర్ సమీపంలో ప్రజలకు నీరందించడానికి నీళ్లట్యాంకు నిర్మించారు. ఈ ట్యాంకు నుంచి ఓ పైపు ద్వారా చాలా నీరు వృథాగా పోతుంది. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా... చర్యలు శూన్యమని వాపోతున్నారు. ఇక్కడ వృథాగాపోయే నీరు సుమారు వెయ్యి కుటుంబాలకు సరిపోతుందని చెబుతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని నగరవాసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి...