ETV Bharat / state

Babai Vs Abbai: వైసీపీలో భగ్గుమంటున్న విబేధాలు.. ఈసారి బాబాయ్​ Vs అబ్బాయ్​.. వేమన పద్యం చెప్పి మరీ..!

Conflicts Between YCP Leaders In Nellore: అధికార వైసీపీలో మరోసారి వర్గపోరు రచ్చకెక్కింది. ఎమ్మెల్యే.. ఆయన బంధువు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విబేధాలు చేరుకున్నాయి. ఇప్పటికే వాళ్లిద్దరి మధ్య జరుగుతున్న గొడవలకు.. తాజాగా జరిగిన ఓ సంఘటన మరింత హీటెక్కించింది. ఇంతకీ ఇది ఎక్కడంటే..?

నెల్లూరులో బాబాయ్​ Vs అబ్బాయ్
నెల్లూరులో బాబాయ్​ Vs అబ్బాయ్
author img

By

Published : May 20, 2023, 2:13 PM IST

Updated : May 20, 2023, 2:56 PM IST

War Between YCP Leaders In Nellore: నెల్లూరు అధికార వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీలో వర్గపోరు మళ్లీ రచ్చకెక్కింది. ఎమ్మెల్యే అనిల్ కుమార్, ఆయన బంధువు రూప్ కుమార్ యాదవ్ మధ్య పచ్చిగడ్డి వేస్తే మండే స్థాయికి విభేదాలు చేరాయి. పరస్పర విమర్శలు, ఆధిపత్య పోరు కొనసాగుతున్న వేళ.. శుక్రవారం రూప్‌ కుమార్‌ అనుచరుడిపై దాడి.. ఆ వర్గపోరును మరింత రాజేసింది. ఈ దాడి నెల్లూరు నగర ఎమ్మెల్యే చేయించారంటూ రూప్‌ కుమార్‌ యాదవ్‌.. వేమన పద్యం జతచేసి మరీ బహిరంగ విమర్శలు చేయడం.. అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల నెల్లూరు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌.. మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఆయన బాబాయ్‌ రూప్‌కుమార్‌ని పిలిచి చెయ్యి చెయ్యి కలిపారు. కలిసి ఉంటే కలదు సుఖం అని నచ్చచెప్పారు. అయితే ఇద్దరూ కలవకపోగా.. వర్గ విబేధాలు మరింత ఎక్కువయ్యాయి. రూప్‌ కుమార్‌ అనుచరుడిపై దాడి మరోసారి ఇద్దరి మధ్యా ఉన్నా విబేధాలను బహిర్గతం చేశాయి.

శుక్రవారం రాత్రి వైసీపీ విద్యార్ధి నేత హాజీపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తీవ్ర స్థాయిలో దాడి చేశారు. అతడి తలకు తీవ్రగాయాల అయ్యాయి. నెల్లూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి తన అనుచరుడ్ని పరామర్శించారు. తనపై దాడి చేయించింది ఎమ్మెల్యే అనిల్ అని బాధితుడు ఆరోపించాడు.

"నా పేరు హాజీ. వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా. 12సంవత్సరాల నుంచి మాజీ మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​తోనే ఉన్నాను. ఆయన కోసమే కష్టపడ్డా. ఆయన వెంటే తిరిగా. ఆయన కార్యక్రమాల కోసం వందల మందిని తీసుకెళ్లాను. గత కొన్ని నెలల నుంచి ఆయనతో దూరంగా ఉన్నానని.. షాపులు పగలకొట్టడాలు, నా మీద దాడి చేయించారు. ఆరు మంది నా పై దాడి చేశారు. వారి చేతుల్లో కత్తులు ఉన్నాయి. మాజీ మంత్రి అనిల్​ కుమార్​ అనుచరులే నాపై దాడి చేశారు"-హాజీ, బాధితుడు, వైసీపీ విద్యార్ధి నేత

అనుచరుడిపై దాడిని తీవ్రంగా తప్పుబట్టిన రూప్‌కుమార్‌.. నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ తన అనుచరులతోనే ఈ దాడి చేయించారంటూ మండిపడ్డారు . అల్పబుద్ధి వానికధికారమిచ్చినా అనే వేమన మద్యం చదివి బహిరంగ విమర్శలు చేశారు . గతంలోనూ తమ అనుచరులపై దాడులు చేశారని.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీలో వర్గపోరు రోజురోజుకూ తీవ్రమవుతోంది.

"వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి విగ్రహానికి రక్త తిలకం దిద్దిన షేక్​ హాజీ.. కేవలం రూప్​ కుమార్​తో ఉన్నాడనే కారణంతో అతనిపై దాడి చేయించారు. పోలీసులకు ఫిర్యాదులు చేసిన.. దాడి చేసిన వారికి రాచమర్యాదలు చేస్తున్నారు. అన్నా జగనన్నా ఒక్కసారి నెల్లూరులో ఏం జరుగుతుందో నివేదిక తెప్పించుకో. ఎవ్వరు తప్పు చేసినా ఆఖరికి మేము తప్పు చేసినా మాపై చర్యలు తీసుకోండి"-రూప్‌కుమార్‌ యాదవ్ , నెల్లూరు నగర డిప్యూటీ మేయర్

నెల్లూరులో బాబాయ్​ Vs అబ్బాయ్

ఇవీ చదవండి:

Last Updated : May 20, 2023, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.