దివ్యాంగుల పట్ల దయ, సానుభూతిని చూపించడంతో పాటు వారిని ప్రోత్సహించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలో రెండోరోజు పర్యటనలో భాగంగా... వెంకటాచలంలోని దివ్యాంగుల ప్రాంతీయ శిక్షణా కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి సందర్శించారు.
దివ్యాంగుల్లో ఉన్న ప్రతిభను గుర్తించాలని, నైపుణ్యతను పెంచితే సాధికారిత సాధ్యం అవుతుందని అన్నారు. సామాజిక బాధ్యతగా బ్యాంకులు, దాతలు, ఆర్థిక సంస్థలు సహకరించాలని కోరారు. ఆత్మవిశ్వాసంతో వైకల్యాన్ని అధిగమించవచ్చని చెప్పారు. అనంతరం వారికి బహుమతులు అందజేశారు.
ఇదీ చూడండి: PADAYATRA: అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం.. కారణమేంటంటే..?