ETV Bharat / state

కొండమ్మ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్

నెల్లూరు జిల్లాలో ఆత్మహత్య(suicide) చేసుకున్న కొండమ్మ కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ(State Women's Commission Chairperson Vasireddy Padma) పరామర్శించారు. వారి పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కొండమ్మ మృతికి కారుడైన ఆమె భర్తను కఠినంగా శిక్షిస్తామన్నారు. దిశ యాప్​పై అవగాహన లేకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.

Vasireddy Padma
వాసిరెడ్డి పద్మ
author img

By

Published : Sep 23, 2021, 8:40 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కొండమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ(State Women's Commission Chairperson Vasireddy Padma) స్పందించారు. మృతురాలి ఇంటికి వెళ్లి.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కళ్లేదుటే భార్య ప్రాణం తీసుకుంటుంటే ఆమె భర్త కనీసం మనిషిగా కూడా స్పందించకపోవటం బాధాకరమన్న వాసిరెడ్డి..వారి పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపడతామన్నారు. దిశ యాప్​పై అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. కొండమ్మ మృతికి ప్రత్యక్షంగా కారకుడైన ఆమె భర్తను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి

LIVE SUICIDE: కళ్లెదుటే భార్య ఉరి..ఆపకుండా వీడియో తీసిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.