నెల్లూరు జిల్లా వరికుంటపాడు సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 565 జాతీయ రహదారి వరికుంటపాడు సమీపంలో.. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్నాయి. పామూరు వైపునుంచి వెళ్తున్న కారు, దుత్తలూరు వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కర్నూలుకు చెందిన పాలూరి సుబ్బారెడ్డి (46), కడపకు చెందిన చిన్నారెడ్డి (42).. కారులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. బొలెరో నడుపుతున్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలుకాగా.. చికిత్స కోసం పామూరు వైద్యశాలకు తరలించారు.
ఇదీ చదవండి:
కేఆర్ఎంబీకి తెలంగాణ మరో లేఖ... త్రిసభ్య కమిటీ భేటీ వాయిదాకు వినతి