ఉదయగిరిలోని పసుపు కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేశారు. యార్డుకు తెచ్చిన పసుపు కొమ్ములను తీసుకోకుండా.. నిబంధనల పేరుతో అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. నాణ్యత గల కొమ్ములు విక్రయానికి తెచ్చినా... మార్క్ఫెడ్, వ్యవసాయ మార్కెట్ అధికారులు కొనుగోలు చేయకుండా వెనక్కు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పసుపులో తక్కువ పొడవు కలిగిన కొమ్ములు ఎక్కువగా ఉన్నాయని, తేమ శాతం ఎక్కువగా ఉందంటూ తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. నాణ్యత గల పసుపుకొమ్ములు తెచ్చినా ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదంటూ వాపోయారు. ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని తమను ఇబ్బంది పెట్టకుండా పసుపు కొనుగోలు చేయాలన్నారు.
ఇదీ చదవండి: