ETV Bharat / state

'ఆనందయ్య మందుకు అనుమతి వస్తే.. పరిశోధనలకు ప్రోత్సాహం'

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద వైద్యానికి కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి సమ్మతి లభిస్తే... తదుపరి పరిశోధనలకు ప్రోత్సహించాలని తితిదే భావిస్తోంది. రాష్ట్ర కోవిడ్ కంట్రోల్ సెంటర్ ఛైర్మన్, తితిదే ఈవో కేఎస్ జవహర్ రెడ్డి ఇప్పటికే ఈ ప్రతిపాదనలను చర్చకు తీసుకువచ్చారు. ప్రాథమిక విచారణ కోసం తితిదే పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఓ బృందం నెల్లూరు జిల్లాలో పర్యటించి ఆనందయ్య ఔషధ తయారీ తీరును తెలుసుకునే ప్రయత్నం చేసింది.

కృష్ణపట్నం ఆనందయ్య ఔషధంపై తితిదే దృష్టి
కృష్ణపట్నం ఆనందయ్య ఔషధంపై తితిదే దృష్టి
author img

By

Published : May 23, 2021, 6:41 AM IST

కృష్ణపట్నం ఆనందయ్య ఔషధంపై తితిదే దృష్టి

కరోనాకు విరుగుడుగా దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరుగుతున్న నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద వైద్యంపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి సారించింది. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఆయుర్వేద ఆసుపత్రి, వైద్యకళాశాల, సొంత ఫార్మసీని నిర్వహిస్తున్న తితిదే.. ఒకవేళ కేంద్ర ఆరోగ్యశాఖ బృందాల నుంచి ఆనందయ్య ఔషధానికి అనుమతులు లభిస్తే తదుపరి పరిశోధనలు నిర్వహించాలనే ఆలోచనకు వచ్చింది. తుడా ఛైర్మన్, తితిదే పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రికి చెందిన ఓ బృందంతో కలిసి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో పర్యటించారు. ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసిన ఆనందయ్యను కలిసిన చెవిరెడ్డి ఆ ఔషధాన్ని తయారు చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

ఆనందయ్య ఔషధం తయారీ విధానం, వినియోగించిన వన మూలికలు, మందు ఏ విధంగా పనిచేస్తుంది? అనే అంశాలపై ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి బృందం ఆరా తీసింది. నమూనాలను సేకరించిన అనంతరం ఆనందయ్య కుటుంబ సభ్యులతో చర్చించింది. మందు పనితీరు గురించి గ్రామ ప్రజలనూ అడిగి తెలుసుకుంది. ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనాను ఆయుర్వేద మందు నయం చేస్తుందని ప్రజలు విశ్వసిస్తున్న వేళ.. ఔషధం పనితీరుపై యుద్ద ప్రాతిపదికన అధ్యయనం సాగించాల్సిన అవసరం ఉందని చెవిరెడ్డి అన్నారు. ఆయుర్వేద మందు నిజంగా ఆమోదయోగ్యమైతే భవిష్యత్తులో ప్రజలకు అందించేందుకు తితిదే ఆయుర్వేదిక్ ఫార్మసీ ద్వారా అందుబాటులోకి తెస్తామన్నారు.

ఇప్పటికే ఆనందయ్య ఔషధ పనితీరు పై ఐసీఎంఆర్, ఆయుష్ ప్రతినిధులు నమూనాలు సేకరించిన నేపథ్యంలో అధ్యయనం నివేదిక సానుకూలంగా ఉంటే శ్రీవారి పాదాల చెంత ఆయుర్వేద మందు పంపిణీకి ప్రయత్నం ప్రారంభిస్తామని చెవిరెడ్డి వెల్లడించారు. ఐసీఎంఆర్ అధ్యయన నివేదిక వచ్చే లోపు తిరుపతి ఆయుర్వేదిక్ ఆసుపత్రి నుంచి వివిధ విభాగాధిపతులు, ఆచార్యులతో కూడిన 11మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఔషధం పనితీరును అధ్యయనం చేస్తుందని చెవిరెడ్డి వివరించారు.

ఇవీ చదవండి:

రేపట్నుంచి ఏపీ వాసులకు ఈ-పాస్‌ తప్పనిసరి: తెలంగాణ పోలీసులు

'కరోనా మృతుల పట్ల మోదీ మొసలి కన్నీరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.