నెల్లూరు జిల్లాలోని పెన్నా బ్యారేజి పొర్లుకట్ట పనులను కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం గిరిజనులు అడ్డుకున్నారు. పోర్లుకట్ట పనుల వల్ల తాము ఇళ్లు, పొలాలు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్న తమను రెండు రోజుల్లో ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. ప్రత్యామ్నాయం చూపకుండా.. ఇళ్లు ఖాళీ చేయమంటే తాము ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: బిల్లులు చెల్లించాలని 'నీరు- చెట్టు పథకం' గుత్తేదారుల ధర్నా