నెల్లూరు జిల్లా కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో రైతులు నిరసనకు దిగారు. ధరలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు సిండికేటుగా మారి మోసం చేస్తున్నారని ఆరోపించారు. కిలో పొగాకు రూ. 180 నుంచి రూ. 150 కి పడిపోయిందని వాపోయారు. ధరలు ఈ విధంగా ఉంటే కనీసం పెట్టుబడులు సైతం రావని ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: