నెల్లూరు జిల్లా గూడూరు లో బుధవారం జరిగిన చోరీ కేసును ఒక్క రోజు వ్యవధిలోనే ఛేదించారు పోలీసులు. జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఇంట్లో పనిచేసే మహిళ చిట్టెమ్మ.. చోరీ చేసినట్టు గుర్తించారు. ఫిర్యాదు అనంతరం.. ఆమె ఆచూకీ కోసం గాలిస్తుండగా.. రాపూరు వద్ద పట్టుబడింది. విచారణ చేయగా నేరాన్ని అంగీకరించింది. బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకుని.. నిందితురాలిని కోర్టులో హాజరు పరిచారు.
ఇదీ చదవండి:
భూముల స్వాధీనంపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన